संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

కావలి జనసేన సమన్వయకర్త మన్నెమాల సుకుమార్‌ రెడ్డిని ఘనంగా సన్మానించిన 23వ వార్డు నాయకులు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
కావలి జనసేన సమన్వయకర్త మన్నెమాల సుకుమార్‌ రెడ్డిని ఘనంగా సన్మానించిన 23వ వార్డు నాయకులు

నెల్లూరు జిల్లా, కావలి జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మన్నెమాల సుకుమార్ రెడ్డి గారిని కావలి పట్టణంలోని 23వ వార్డు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా 23వ వార్డు ప్రముఖ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ వైస్ ప్రెసిడెంట్ దాసరి కిషోర్ కుమార్, వానంశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలువురు జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు సుకుమార్ రెడ్డి గారి కార్యాలయంలో ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత పటిష్టం చేసేందుకు సుకుమార్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తామంతా ఆయన వెన్నంటే ఉండి పనిచేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కావలి జనసేన సమన్వయకర్త మన్నెమాల సుకుమార్‌ రెడ్డిని ఘనంగా సన్మానించిన 23వ వార్డు నాయకులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *