Story highlights
- సిద్ధేశ్వరం, భైరవకోనకు నేరుగా ప్రయాణ సౌకర్యం ఉదయగిరి నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరు..
- మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం ఉదయగిరి: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది.
- భక్తుల సౌకర్యార్థం ఉదయగిరి డిపో నుంచి సిద్ధేశ్వరం, భైరవకోన పుణ్యక్షేత్రాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది.
సిద్ధేశ్వరం, భైరవకోనకు నేరుగా ప్రయాణ సౌకర్యం
ఉదయగిరి నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరు.. మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణం
ఉదయగిరి: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. భక్తుల సౌకర్యార్థం ఉదయగిరి డిపో నుంచి సిద్ధేశ్వరం, భైరవకోన పుణ్యక్షేత్రాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసును ఏర్పాటు చేసింది.
ఈ విషయాన్ని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ కుమార్ వెల్లడించారు. నవంబర్ నెలలో ప్రతి సోమవారం ఉదయం 7.30 గంటలకు ఉదయగిరి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరి సిద్ధేశ్వరం మీదుగా భైరవకోనకు చేరుకుంటుందని తెలిపారు.
అనంతరం అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు భైరవకోన నుంచి తిరుగు ప్రయాణమై సిద్ధేశ్వరం మీదుగా ఉదయగిరికి చేరుకుంటుందని వివరించారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు.