खबर की मुख्य बातें
- Uploaded Video:
**కాకినాడ:** అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి **కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని** డిమాండ్ చేస్తూ స్కీం వర్కర్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇంటి వద్ద ధర్నా నిర్వహించారు.
నాగమల్లితోట జంక్షన్ నుంచి ర్యాలీగా ఎంపీ ఇంటికి చేరుకున్న కార్మికులు తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అనుచరులకు వినతిపత్రం అందజేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీం వర్కర్ల వేతనాలను పెంచాలని, సమస్యలు పరిష్కరించకపోతే **డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీలో ఆందోళన చేపడతామని** సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.
Uploaded Video: