Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Rangareddy

కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ ఘనంగా ప్రారంభం. నాణ్యమైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Punnami Newsroom Published: Updated:
కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ ఘనంగా ప్రారంభం. నాణ్యమైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

చైతన్యపురి మారుతినగర్‌లో యూనియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ సంస్థను స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నిర్వాహకులు వంశీకృష్ణతో కలిసి ఆదివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డిజిటల్ ప్రింటింగ్, ఫ్లెక్స్ ప్రింటింగ్, అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. 1996 నుంచి ప్రింటింగ్ రంగంలో అనుభవం కలిగిన సంస్థ ఆధునిక సాంకేతికతతో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

నిర్వాహకులు వంశీకృష్ణ మాట్లాడుతూ.. ఫ్లెక్స్, వినైల్, బ్యాక్‌లిట్, ఫ్రంట్‌లిట్, అక్రిలిక్, 3డీ లెటర్స్, వాల్‌పేపర్స్, గ్లాస్, ఆఫీస్, వెహికల్ బ్రాండింగ్‌తో పాటు హోర్డింగ్స్, స్టిక్కర్లు, బ్రోచర్లు, విజిటింగ్ కార్డులు, ప్యాకేజింగ్ ప్రింటింగ్ తదితర సేవలను సరసమైన ధరలకు అందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రతి బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు కల్పించడమే తమ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగా నర్సింహ గుప్త, బాలరాజ్ గుప్తా, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కల్కి డిజిటల్ ఫ్లెక్స్ ప్రింటింగ్ అండ్ బ్రాండింగ్ ఘనంగా ప్రారంభం. నాణ్యమైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *