खबर की मुख्य बातें
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి) జట్లకొండూరు సెగ్మెంట్ పరిధిలోని జట్లకొండూరు, చెర్లోపల్లి, బండేపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలకు ఎంపీటీసీ అభ్యర్థి పొన్నూరు కాంచన, జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
- ఎన్నికల్లో తమకు అమూల్యమైన ఓట్లు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
- మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పే ముఖ్యమని పేర్కొన్నారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 8 ( పున్నమి ప్రతినిధి)
జట్లకొండూరు సెగ్మెంట్ పరిధిలోని జట్లకొండూరు, చెర్లోపల్లి, బండేపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలకు ఎంపీటీసీ అభ్యర్థి పొన్నూరు కాంచన, జెడ్పీటీసీ అభ్యర్థి పొట్టేళ్ల ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తమకు అమూల్యమైన ఓట్లు వేసి విజయాన్ని అందించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మెజారిటీ ఎంత అన్నది ముఖ్యం కాదని, ప్రజలు ఇచ్చిన తీర్పే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, వారి ఆదరాభిమానాలే తమకు కొండంత బలమని పేర్కొన్నారు. ప్రజాసేవకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग