संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా. వి. గోపీనాథ్ ఎంపిక

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా. వి. గోపీనాథ్ ఎంపిక

खबर की मुख्य बातें

  • *గూడూరుకు గర్వకారణం* *ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా.
  • వి.
  • గోపీనాథ్ ఎంపిక* మహబూబాబాద్: గుజరాత్ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (Statue of Unity) వద్ద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న *'సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి - ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) - అక్టోబర్…

*గూడూరుకు గర్వకారణం*
*ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా. వి. గోపీనాథ్ ఎంపిక*

మహబూబాబాద్: గుజరాత్ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (Statue of Unity) వద్ద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న *’సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి – ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) – అక్టోబర్ 31, 2026’* కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన *ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు డా. వి. గోపీనాథ్* ఎంపిక కావడం గర్వకారణం.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా నుండి 5 గురు విశిష్ట వ్యక్తులను ఎంపిక చేయగా, అందులో ఒకరిగా తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని డా. గోపీనాథ్ తెలిపారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే అధికారిక పర్యటన అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటుతానని ఆయన పేర్కొన్నారు.

గతంలో సేవా కార్యక్రమాలకు గాను డా. వి. గోపీనాథ్ ఢిల్లీ వేదికగా డా. బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు, గౌరవ డాక్టరేట్ అవార్డు మరియు 2025 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *