संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

ఏఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ఏఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు

खबर की मुख्य बातें

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 11 మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ టి.
  • నిషాంతి గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  • పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) నియమాలు–2006, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ కేంద్రాలను ఎంపిక చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 11 మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ టి. నిషాంతి గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) నియమాలు–2006, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ కేంద్రాలను ఎంపిక చేశారు. అరకు వ్యాలీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాడేరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డుంబ్రిగూడలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల, కొయ్యూరులో కేజీబీవీ పాఠశాల, చింతపల్లిలో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కేంద్రాలుగా ఖరారు చేశారు.
జోనల్, రూట్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఓటర్లు ఇబ్బందులు లేకుండా ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీసు బందోబస్తును పర్యవేక్షించడంతో పాటు, సిబ్బంది ఎన్నికల సామగ్రితో సురక్షితంగా కేంద్రాలకు చేరేలా చూడాలని, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ మద్యం రవాణా, పంపిణీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని రిసెప్షన్ కేంద్రాలకు చేర్చి, స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

समाचार स्रोत

  • Punnami Reportingआधिकारिक बयान

Leave a comment

Your email address will not be published. Required fields are marked *