Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

ఏఎస్ఆర్ జిల్లాలో ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్ నిషాంతి

Punnami Newsroom Published:
ఏఎస్ఆర్ జిల్లాలో ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్ నిషాంతి

Story highlights

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టి.
  • నిషాంతి తెలిపారు.
  • పాడేరు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు 617 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని, 4,98,467 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. పాడేరు కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు 617 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని, 4,98,467 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని చెప్పారు. పోలింగ్ విధుల్లో 3,702 మంది ఉద్యోగులు ఉంటారని, 78 మంది జోనల్, 117 మంది రూట్ అధికారులను నియమించామన్నారు. 149 సున్నిత, 91 అతిసున్నిత కేంద్రాల్లో ప్రత్యేక భద్రతతో పాటు వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, 78 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని వివరించారు. పోలింగ్ సామగ్రి బుధవారం పంపిణీ చేస్తామని, సాధారణ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు, 44 మారుమూల కేంద్రాల్లో మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు 7న జరుగుతుంది. సమావేశంలో ఎన్నికల పరిశీలకులు కూర్మనాథ్, ధీరజ్ హన్స్, జడ్పీ సీఈఓ వాసుదేవరావు పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOfficial statement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *