संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

ఎన్నికల విధి నిర్వహణలో పోలీస్ వ్యవస్థ అగ్రస్థానంలో ఉండాలి!!!పామూరు పట్టణ యస్. ఐ. కట్టా అనూక్

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఎన్నికల విధి నిర్వహణలో పోలీస్ వ్యవస్థ అగ్రస్థానంలో ఉండాలి!!!పామూరు పట్టణ యస్. ఐ. కట్టా అనూక్

खबर की मुख्य बातें

  • ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: పామూరు యస్.
  • ఐ.
  • కట్టా అనూక్!!!!

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు: పామూరు యస్. ఐ. కట్టా అనూక్!!!!
=============================≠≠======

. రెండవ సాధారణ ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి అవగాహన సదస్సు!!!
================================
పామూరు, నవంబర్ 4 ( పున్నమి న్యూస్రా ప్రతినిది ) రాబోయే రెండవ సాధారణ ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పామూరు సబ్ ఇన్స్పెక్టర్( ఎస్సై ) కట్టా అనూక్ పిలుపు నిచ్చారు..బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలోయస్ఆ. ఐ. ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఎన్నికల నియమావళి, భద్రత చర్లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై కట్టా అనూక్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
సమస్యాత్మక, గ్రామాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలి. గ్రామాలలోని ప్రజలు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ తరపున భరోసా కల్పించాలి ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేసిఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పామూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు,మరియు హోంగార్డులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *