ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి సార్..!
మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ వల్ల అధిక పని భారం పడుతోందని, ఒక విభాగానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను కేటాయించాలని, జీవో ఎంఎస్ 5 ప్రకారం స్థానిక సచివాలయంలోనే ఉద్యోగం కొనసాగించే అవకాశం ఇవ్వాలని కోరారు.