Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kamareddy

ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ నమూనా ఆవిష్కరణ..

Punnami Newsroom Published:
ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ నమూనా ఆవిష్కరణ..

– రోడ్డు భద్రతకు మంత్రి సీతక్క పిలుపు!

కామారెడ్డి,20 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :

రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాలను కాపాడా లనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్క (దానసరి అనసూ య) నూతన హెల్మెట్ నమూనాను కామారెడ్డి పట్టణంలో ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి సీతక్క ప్రజలకు స్పష్టం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారు లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హైదరాబా ద్. ఈ కొత్త హెల్మెట్ భద్రతా ప్రమాణాలకు అనుగు ణంగా ఉండటంతో పాటు తేలికగా, సౌకర్యవంతం గా రూపొందించబడిందని తెలిపారు. యువత నుంచి అన్ని వయస్సు వారు దీనిని నిత్యం వాడే లా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్య మని చెప్పారు.ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకుం టోందని, “ఆరైవ్ అలైవ్” ద్వారా ప్రజల్లో భద్రతా స్పృహ పెంచుతున్నామని మంత్రి వెల్లడించారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సహక రించాలని పిలుపునిచ్చారు. అనంతరం సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు పని చేయాలి. మంత్రి సీతక్క, కలెక్టర్ సూచనలు! గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రతి సర్పంచ్ పని చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశిం చారు.గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యా నికి పునాది అని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభు త్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయా లని సూచించారు.త్రాగునీరు, పారిశుధ్యం, రహదా రులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయా లకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సీతక్క చెప్పా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అర్హులకు చేరవేయడంలో సర్పం చులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. ప్రజల తో నిరంతర సమన్వయంతో పారదర్శక పాలన సాగించాలని పిలుపునిచ్చారు.గ్రామాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచిం చారు. గ్రామ పంచాయతీలు మౌలిక సదుపాయా ల కల్పనలో కీలకమని, పరిశుభ్రత, త్రాగునీరు, పచ్చదనం, విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, నాణ్యత, పారదర్శకతతో పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆరైవ్ అలైవ్ కార్యక్రమంలో హెల్మెట్ నమూనా ఆవిష్కరణ..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *