Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Literature

ఆమె ఎవరో..?

Punnami Newsroom Published:
ఆమె ఎవరో..?

Story highlights

  • ఆమె ఎవరో..?
  • అనాదిగా వచ్చింది....వస్తూనే ఉంది.
  • అన్నీ అమై చేస్తూనే ఉంది.

ఆమె ఎవరో..?
అనాదిగా వచ్చింది….వస్తూనే ఉంది.
అన్నీ అమై చేస్తూనే ఉంది.
అందంగా వస్తుంది
అవిరై పోతుంది.
అనాది కాలం నుండి
ఆధునిక కాలం వరకు
ఆమె బలైపోతుంది.
అమ్మగా, ఆలిగా, చెల్లిగా
అక్కగా ఇలా విభిన్న పాత్రలలో
అంతుచిక్కని విధంగా
అందరికోసం, మనందరి కోసం
ఆమె బలైపోతుంది.
ఆమె ఎవరో?

ఆమె అందం భర్త కోసం సగం
ఆమె అందం బిడ్డల కోసం సగం
ఆమె త్యాగం చేస్తూనే ఉంది. అయినా….
ఆమెను ఎవరూ గుర్తించరు, ఎందుకంటే
ఆమె ఏనాడూ చెప్పుకోదు కాబట్టి
ఆమెదో ప్రత్యేక ప్రపంచం, ఎందుకంటే
ఆమె తన అమ్మ, నాన్న తన వారందరిని విడచి మరచి
ఆమెకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటుంది.
ఆమె నవ్వు నిశ్శబ్దం చేదిస్తుంది,
ఆమె మౌనం మనకు సినిమా చూపిస్తుంది.
కవి, రచయిత.. J. చిన్నా (సోషల్ టీచర్ )

Leave a comment

Your email address will not be published. Required fields are marked *