Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Warangal

ఆత్మీయుల మధ్య ఘనంగా బోడ పూలు–భారతి దంపతుల గృహప్రవేశం

Punnami Newsroom Published:
ఆత్మీయుల మధ్య ఘనంగా బోడ పూలు–భారతి దంపతుల గృహప్రవేశం

ఖానాపురం పున్నమి ప్రతినిధి: మాజీ ఎంపీటీసీ బోడ పూలు – భారతి దంపతుల నూతన గృహప్రవేశ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్, ఖానాపురం మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ వైస్ ఎంపీపీ రామా సహాయం ఉమా–ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ హాజరై బోడ పూలు–భారతి దంపతులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా బుధరావుపేట మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఎస్.కె. సుభాన్ బి–మౌలానా దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, నాయకులు, ఆత్మీయులు ఈ వేడుకలో పాల్గొని నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గృహప్రవేశ వేడుక ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా జరిగింది.

ఆత్మీయుల మధ్య ఘనంగా బోడ పూలు–భారతి దంపతుల గృహప్రవేశం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *