संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अल्लूरी सीताराम राजू

అల్లూరి జిల్లాలో అక్టోబర్ 5న 30 తారు రోడ్లు ప్రారంభం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
అల్లూరి జిల్లాలో అక్టోబర్ 5న 30 తారు రోడ్లు ప్రారంభం

खबर की मुख्य बातें

  • పాడేరు, అక్టోబర్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.70.68 కోట్లతో నిర్మించిన 75.64 కి.మీ.
  • పొడవైన 30 తారు రోడ్లను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు.
  • ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు తెలిపారు.

పాడేరు, అక్టోబర్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.70.68 కోట్లతో నిర్మించిన 75.64 కి.మీ. పొడవైన 30 తారు రోడ్లను అక్టోబర్ 5న ప్రారంభించనున్నారు. ఈ మేరకు శనివారం జిల్లా అధికారులు తెలిపారు. PM-JANMAN నిధులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించనుండగా, కలెక్టర్, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అనంతగిరి, డుంబ్రిగూడ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో రహదారులు నిర్మించారు. వీటితో మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడనున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *