संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

ఆగ్రహంతో అర్ధాంతరంగా నిష్క్రమించిన ఆనం

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఆగ్రహంతో అర్ధాంతరంగా నిష్క్రమించిన ఆనం

खबर की मुख्य बातें

  • --ఆనంను అనుసరించిన ఆత్మకూరు జెడ్పీటీసీలు --జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికలో ఏకపక్ష వైఖరే కారణమా?
  • --రగిలిపోతున్న ఆనం వర్గం --జిల్లా దేశం నేతల వైఖరిపై ఆనం అక్కసు --జిల్లా దేశంలో మొదలైన ముసలం నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా దేశం అగ్రనేత ఆగ్రహానికి గురయ్యారు .
  • సాక్షాత్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కూడా, ప్రమాణ స్వీకారం జరగకమునుపే అర్ధాంతరంగా కార్యక్రమం నుంచి నిష్క్రమించారు.

–ఆనంను అనుసరించిన ఆత్మకూరు జెడ్పీటీసీలు
–జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికలో ఏకపక్ష వైఖరే కారణమా?
–రగిలిపోతున్న ఆనం వర్గం
–జిల్లా దేశం నేతల వైఖరిపై ఆనం అక్కసు
–జిల్లా దేశంలో మొదలైన ముసలం
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా దేశం అగ్రనేత ఆగ్రహానికి గురయ్యారు . సాక్షాత్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కూడా, ప్రమాణ స్వీకారం జరగకమునుపే అర్ధాంతరంగా కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. ఆయనతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా ఆయన్నే అనుసరించి, ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగేంత వరకు ఉండకుండా వెళ్లిపోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో శుక్రవారం సంచలనం కలిగించింది.
జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికలో కొందరు జిల్లా నేతలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతోనే ఆనం రామనారాయణరెడ్డి అలా అలిగి వెళ్లిపోయినట్లు తెలియవస్తోంది. గత కొద్ది నెలల నుంచి ఎందుకో గానీ ఆనం రామనారాయణరెడ్డి అసహనంగా ఉంటున్నారు. సమయం వచ్చినప్పుడల్లా తన అసహనాన్ని బహిరంగంగానే ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన సీనియర్ మంత్రిగా తాను ఉన్నా, జిల్లా దేశంలో జరిగే విధానపర నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని ఆయన అసహనంగా ఉంటున్నట్లు సమాచారం. తాజాగా జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపికలో కూడా తనను గానీ, జిల్లాకు చెందిన ఇతర దేశం ఎమ్మెల్యేలను గానీ సంప్రదించకుండానే ఇద్దరు ముగ్గురు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు రుచించడం లేదు.
మరోవైపు, తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు రాజకీయాల్లో జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తరచూ వేలు పెడుతూ గడబిడ చేస్తున్నారన్న భావనలు కూడా ఆయనలో ఇప్పటికే అసహనాన్ని రగిలించాయి. ఇక త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆనం రామనారాయణరెడ్డికి ఉద్వాసన పలుకుతారన్న వార్తలు జిల్లాలో హల్‌చల్ చేస్తున్నాయి. తన మంత్రి పదవి విషయంలో జిల్లాకు చెందిన కొందరు సొంత పార్టీ నేతలే అసత్య వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నట్లు కూడా ఆయన విశ్వసిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం.
తాజాగా శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆనం హాజరైనా, ప్రమాణ స్వీకారం జరగకముందే ఆయన అర్ధాంతరంగా కార్యక్రమం నుంచి నిష్క్రమించారు. ఆయనతో పాటు ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీలు కూడా ఆయన్నే అనుసరించి నిష్క్రమించారు. ఇది జిల్లా రాజకీయాల్లో పెను తుఫాను వార్తగా మారింది.
ఎంతో అనుభవం ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గత కొంతకాలంగా ప్రదర్శిస్తున్న అసహనం వెనుక ఇదమిద్ధమైన కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, ఆనం మాత్రం అక్కసుతో, అసహనంతో ఉన్నట్లు తెలియవస్తోంది. దీనికి జిల్లాలోని సొంత పార్టీ నేతల కొందరి తీరుతెన్నులే , దూకుడు విధానాలే కారణమని తెలియవస్తోంది.
ఏది ఏమైనా, ఆనం రానున్న రోజుల్లో తెలుగుదేశంలో మునుపటిలా ఇమడగలరా? లేక ఆగ్రహంతో తన దారి తాను చూసుకుంటారా? అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నెల్లూరు జిల్లా దేశం పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించాల్సి ఉంది. లేకపోతే టీ కప్పులో తుఫానుగా మారే సంఘటనలు టీ కప్పును వదిలేసి తుఫాన్లుగా మారే అవకాశాలు లేకపోలేదు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *