ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ವಿಶಾಖಪಟ್ಟಣಂ

అరిలోవలో ఘనంగా మిలాద్ ర్యాలీ..! చిన్నారులతో సీఐ శ్రీనివాస్ సందడి..!

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
అరిలోవలో ఘనంగా మిలాద్ ర్యాలీ..! చిన్నారులతో సీఐ శ్రీనివాస్ సందడి..!

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • విశాఖపట్నం అరిలోవలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • హజ్రత్ మహమ్మద్ ముస్తఫా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బైకులు, కార్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు.
  • ఆకుపచ్చ జెండాలతో పాటు భారత జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ దరూద్ పాక్ పఠిస్తూ ర్యాలీ కొనసాగింది.

విశాఖపట్నం అరిలోవలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హజ్రత్ మహమ్మద్ ముస్తఫా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో బైకులు, కార్లతో భారీగా ఊరేగింపు నిర్వహించారు.
ఆకుపచ్చ జెండాలతో పాటు భారత జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ దరూద్ పాక్ పఠిస్తూ ర్యాలీ కొనసాగింది. యువతతో పాటు వృద్ధులు పెద్ద సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
కాగా ఈ వేడుకల్లో ఆరిలోవ సీఐ శ్రీనివాస్ కూడా పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. చిన్నారులను ఎత్తుకుని వారితో ముచ్చటిస్తూ ఆప్యాయతను చాటుకున్నారు. సీఐ శ్రీనివాస్ చిన్నారులతో సరదాగా గడిపిన దృశ్యాలు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.
వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *