Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదు..**అక్రమ నిర్ణయాలకే మా

Punnami Newsroom Published:

Story highlights

  • *అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదు..**అక్రమ నిర్ణయాలకే మా వ్యతిరేకత!**ప్రత్యేకాధికారి పాలనలో పంచాయతీ నిధుల పై పెత్తనమా..?**ప్రజాభిప్రాయం లేకుండా పనులు చేపడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం - బీజేపీ**కట్టా.జనార్ధన్ - కోట జర్నలిస్ట్*నెల్లూరు జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల పేరుతో నిధుల వినియోగంలో…
  • కోటలోని బీజేపీ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంచాయతీ సమస్యలు, నిధుల వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాల పై నాయకులు మాట్లాడారు.
  • ప్రస్తుతం కోట గ్రామ పంచాయతీ పరిపాలన ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత అధికారి ఆదేశాలు, నిబంధనల మేరకే జరగాలని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.

*అభివృద్ధికి బీజేపీ అడ్డు కాదు..**అక్రమ నిర్ణయాలకే మా వ్యతిరేకత!**ప్రత్యేకాధికారి పాలనలో పంచాయతీ నిధుల పై పెత్తనమా..?**ప్రజాభిప్రాయం లేకుండా పనులు చేపడితే తీవ్రంగా వ్యతిరేకిస్తాం – బీజేపీ**కట్టా.జనార్ధన్ – కోట జర్నలిస్ట్*నెల్లూరు జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల పేరుతో నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కోటలోని బీజేపీ మండల కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పంచాయతీ సమస్యలు, నిధుల వినియోగం, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాల పై నాయకులు మాట్లాడారు. ప్రస్తుతం కోట గ్రామ పంచాయతీ పరిపాలన ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు సంబంధిత అధికారి ఆదేశాలు, నిబంధనల మేరకే జరగాలని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. కొందరు నాయకులు తమ అనుచరులు, సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా పంచాయతీకి అందుతున్న నిధులను ప్రజలకు అత్యవసరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించాల్సి ఉండగా..ప్రాధాన్యత లేని పనులకు నిధులు మళ్లిస్తే ప్రజాధనం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల ఎంపికలో ముందుగా ప్రజాభిప్రాయాన్ని తీసుకుని అత్యవసర సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. *డ్రైనేజీ సమస్యను ఎందుకు పక్కన పెట్టారు?*కోట పంచాయతీ పరిధిలో పంట కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో జాప్యం జరుగుతోందని నాయకులు విమర్శించారు. ఈ సమస్య పై గతంలో పలుమార్లు వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు కలిసి పరిష్కారం కోసం ప్రయత్నించారని, కొంతమేర నిధులు కూడా కేటాయించబడినప్పటికీ పనులు పూర్తికాలేదని తెలిపారు. ప్రజలకు ఏళ్ల తరబడి ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను పక్కనపెట్టి కొత్తగా అందుబాటులోకి వచ్చిన నిధులతో చిన్న చిన్న పనులు చేయడం సరైన విధానం కాదని బీజేపీ నాయకులు అన్నారు. “ముందుగా అత్యవసర సమస్యలు..ఆ తర్వాత ఇతర అభివృద్ధి పనులు” అనే విధానాన్ని అధికారులు పాటించాలని కోరారు. అభివృద్ధి పనులకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని ప్రజా ప్రయోజనాలు, పారదర్శకత, నిబంధనలకు విరుద్ధంగా జరిగే నిర్ణయాలను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశాల పై వచ్చే సోమవారం జరిగే గ్రీవెన్స్ డేలో సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించి కోట పంచాయతీలో ప్రజలకు అత్యవసరమైన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా జిల్లా సభ్యులు సారంగం.రమేష్ బాబు, మండల అధ్యక్షులు గునుపూడి. హరిబాబు, జనరల్ సెక్రటరీ లింగంగుంట.వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు సత్తెన.అంబరీష్, కే.శరత్ చంద్రరెడ్డి, ట్రెజరర్ పరుశురాం సాయి తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *