Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Dr. B.R. Ambedkar Konaseema

అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీవో తనిఖీలు

Punnami Newsroom Published: Updated:
అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీవో తనిఖీలు

Story highlights

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ పై అమలాపురం ఆర్టీవో దేవిశెట్టి శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు.
  • అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ పై అమలాపురం ఆర్టీవో దేవిశెట్టి శ్రీనివాసరావు తనిఖీలు నిర్వహించారు. అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి జిల్లా రవాణా శాఖ అధికారి ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన 21 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 12 బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. మోటారు వాహన చట్ట నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ట్రావెల్స్ యాజమాన్యాలకు రూ. 40,800 జరిమానా విధించినట్లు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. మోటారు వాహనాల చట్టాన్ని కాదని ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సురేష్ కుమార్, వరప్రసాద్ తదితర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *