అధైర్యపడొద్దు అండగా నేను ఉన్న: శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

    0
    204

    09-06-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి)
    నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలో రెడ్ జోన్ ప్రాంత మైన మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామం లో పర్యటించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
    ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కుల పంపిణీ.
    రెడ్ జోన్ ప్రాంతాలలో అధికారులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్ల కు, ప్రజలకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే కాకాణి.
    ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ రావడంతో నేను ఇక్కడకు వచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు, మీకు ధైర్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను.
    కరోనా అనేది ప్రాణాంతకర వ్యాధి కాకపోయినా, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వస్తే ఇబ్బందులు కలుగుతాయి.
    కరోనా వైరస్ పై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.ఎవరూ ఆందోళన చెంది, భయపడాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ వ్యక్తి ని మనమందరం వారిని కుటుంబ సభ్యులుగా భావించి, అండగా “చేదోడు – వాదోడు” గా ఉండాలి.
    అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
    మీ అవసరాల కోసం మీకు ఈ ప్రాంతంలో ఉంటూ ఈ సమస్యను పరిష్కరించుకుందాం.
    మీకు నేను అండగా ఉంటాను, ఎక్కడా విభేదాలకు పోకుండా సమస్యను అధికమించుదాం.
    ఏ సమయంలోనైనా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, నాకు ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేస్తాను.ఈ కార్యక్రమంలో వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి ,బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్,కిరణ్ కుమార్ రెడ్డి ,దాసరి మహేంద్ర వర్మ ,చాంద్ భాషా,కరిముల్లా, మోహన్ నాయుడు మరియు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.