ಸಂಪರ್ಕಿಸಿ ಇತ್ತೀಚಿನ ಸುದ್ದಿ
ನಿಜವಾದ ಸುದ್ದಿ. ವೇಗವಾದ ಮಾಹಿತಿ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ • ತೆಲಂಗಾಣ • ರಾಷ್ಟ್ರೀಯ
ಲೇಖಕರ ಪ್ಯಾನೆಲ್
ಅನಕಾಪಳ್ಳಿ

అచ్యుతాపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం

ಪುನ್ನಮಿ ನ್ಯೂಸ್‌ರೂಮ್ ಪ್ರಕಟಿತ:
అచ్యుతాపురంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం

ಸುದ್ದಿಯ ಮುಖ್ಯಾಂಶಗಳು

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం అచ్యుతాపురం ఎస్‌కేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
  • ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల తిరుపతిరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ హాజరయ్యారు.
  • కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం అచ్యుతాపురం ఎస్‌కేఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఏపీ ఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మాజీ ఎంపీ పప్పల తిరుపతిరావు, మాజీ జడ్పీ చైర్మన్ లాలం భవాని భాస్కర్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పప్పల చలపతిరావు, గోంతిన హరీష్, పీలా తులసీరామ్, గొర్లె శివనారాయణమూర్తి (నానాజీ), ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, లాలం శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడించారు. అనంతరం 43 మంది బాధితులకు రూ.25.50 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివఅప్పారావు, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దూళి రంగనాయకులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా నాగభూషణం, దాడి రమేష్, ఆడారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *