Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
NTR District

అంతర్గత ఎభేదాలతో రచ్చకెక్కుతున్న బిజెపి పున్నమి న్యూస్ పద్ధతి ఎన్టీఆర్ జిల్లా

Punnami Newsroom Published:
అంతర్గత ఎభేదాలతో రచ్చకెక్కుతున్న బిజెపి పున్నమి న్యూస్ పద్ధతి ఎన్టీఆర్ జిల్లా

*_బీజేపీలో ఫ్లెక్సీ బ్యానర్ల చిచ్చు_*

– రచ్చకెక్కుతున్న అంతర్గత విభేదాలు

– ఫ్లెక్సీల్లో ఫొటోల కోసం పాకులాడుతున్న నాయకులు

– ఇటీవల రెండు సార్లు రోడ్డుపై ఘర్షణలు

– ఈలప్రోలులో కూటమి జెండా దిమ్మెల ఆవిష్కరణలో మరోసారి బయటపడ్డ విభేదాలు

– నియోజకవర్గ మాజీ ఇన్ చార్జి ఫొటోపై స్టిక్కర్ అంటించడంతో కలకలం

– జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లిన సదరు నేత

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): మైలవరం నియోజకవర్గ బీజేపీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కొద్దికాలం నుంచి ఆ పార్టీ నేతల్లో ఫ్లెక్సీ బ్యానర్లు చిచ్చు పెడుతున్నాయి. ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు లేవంటూ ఇటీవల ఇబ్రహీంపట్నానికి చెందిన ఇద్దరు బీజేపీ నాయకులు బహిరంగంగా ఇతర నేతలతో ఘర్షణకు దిగారు. తాజాగా ఈలప్రోలులో జరిగిన కూటమి జెండా దిమ్మెల ఆవిష్కరణ కార్యక్రమ ఫ్లెక్సీలో బీజేపీ నియోజకవర్గ మాజీ కన్వీనర్ ఫొటోపై తెల్ల స్టిక్కర్ అంటించడం ఆ పార్టీలో కలకలం రేపింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ హాజరైన ఈ కార్యక్రమంలో విభేదాలు రచ్చకెక్కడం చర్చకు దారితీసింది. ఫ్లెక్సీ బ్యానర్ లో నాయకుడి ఫొటోపై స్టిక్కర్ అంటించడంతో మనస్తాపం చెందిన సదరు నాయకుడు జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

*_కార్యదర్శి ఫొటో కోసమే వివాదం_*
ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో తన ఫొటో ముద్రించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ప్రొటోకాల్ ప్రకారం జిల్లా అధ్యక్షుడి ఫొటో మాత్రమే ముద్రిస్తున్నారు. దీంతో ఆ జిల్లా కార్యదర్శి తన ఫొటో కోసం స్థానిక నేతలతో కార్యక్రమాల్లో పాల్గొంటూనే వైరం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫ్లెక్సీలో ఫొటో విషయమై సదరు జిల్లా కార్యదర్శి స్థానిక నేతలతో రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. అంతకుముందు మరో కార్యక్రమ ఫ్లెక్సీలో తన ఫొటో లేదని మరో నాయకుడు జి.కొండూరుకు చెందిన సీనియర్ నాయకుడితో రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఈ ఘటనలపై జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదులు చేశారు. తాజాగా నియోజకవర్గ మాజీ ఇన్ చార్జి ఫొటోపై స్టిక్కర్ అంటించడం ఆందోళన కలిగించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతుండటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి దృష్టి పెట్టాల్సిన నేతలు ఫ్లెక్సీల్లో ఫొటోలు కోసం రచ్చకెక్కడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బీజేపీ జిల్లా నాయకత్వం స్పందించి పార్టీలో విభేదాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.

*_చక్కదిద్దుకుని ముందుకెళ్తాం_*
బీజేపీ అతి పెద్ద కుటుంబం. ఇందులో చిన్నచిన్న మనస్పర్ధలు, విభేదాలు ఉండటం సహజం. వాటిని చక్కదిద్దుకుని ముందుకు వెళ్తాం. విభేదాలు పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేస్తాం.
*__అడ్డూరి శ్రీరామ్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు_*

అంతర్గత ఎభేదాలతో రచ్చకెక్కుతున్న బిజెపి పున్నమి న్యూస్ పద్ధతి ఎన్టీఆర్ జిల్లా

అంతర్గత ఎభేదాలతో రచ్చకెక్కుతున్న బిజెపి పున్నమి న్యూస్ పద్ధతి ఎన్టీఆర్ జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *