Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

శ్రీకాళహస్తి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే

Punnami Newsroom Published:
శ్రీకాళహస్తి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే

Story highlights

  • శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సీఎం ఫంక్షన్ హాల్‌ నందు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంట్ ఉద్యమ ఆర్డినేటర్ ఆరణి శ్రీనివాసులు విచ్చేసి శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఉద్యమి సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా కొట్టేసాయి ప్రసాద్ మార్చి 8వ తేదీన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే చేతుల మీదగా మహిళలకు చీరలు పంపిణీ చేయించడం జరిగినది.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని సీఎం ఫంక్షన్ హాల్‌ నందు ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి పార్లమెంట్ ఉద్యమ ఆర్డినేటర్ ఆరణి శ్రీనివాసులు విచ్చేసి శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతో ఉద్యమి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టేసాయి ప్రసాద్ మార్చి 8వ తేదీన జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే చేతుల మీదగా మహిళలకు చీరలు పంపిణీ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, సత్యవేడు జనసేన పార్టీ ఇంచార్జ్ లావణ్య కుమార్, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి జయప్రకాశ్, జనసేన శ్రీకాళహస్తి పట్టణ నాయకులు గరికపాటి చంద్ర, ఇతర జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *