Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Visakhapatnam

విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం

Punnami Newsroom Published:

విశాఖపట్నం బీచ్ రోడ్డులో శనివారం సుమారు ఉదయం 10:00 గంటల సమయంలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వెళ్తున్నట్లు విశాఖపట్నం సీపీ కు సమాచారం అందింది. సీపీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించి, సిబ్బంది సహాయంతో సదరు మహిళను రక్షించడం జరిగింది.
అనంతరం, మమతా ట్రస్ట్ నిర్వాహకురాలు మమత సహకారంతో బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించి, అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా, సీపీ ఆదేశాల మేరకు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అందుబాటులో ఉన్న పత్రాలు మరియు ఇతర మార్గాల ద్వారా బాధితురాలి కుటుంబ సభ్యులు మరియు బంధువుల ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించి, బాధితురాలికి సంబంధించిన బంధువుల వివరాలను సేకరించడం జరిగింది.
ఈరోజు అనగా సోమవారం ఆమె భర్త మరియు అల్లుడు రావడంతో, మమతా ట్రస్ట్ నిర్వాహకురాలు మమత సమక్షంలో బాధితురాలిని ఆమె భర్త మరియు అల్లుడికి అప్పగించడం జరిగింది.
ఈ విధంగా సీపీ ఆదేశాల మేరకు బాధితురాలిని సకాలంలో రక్షించి, వైద్య సహాయం అందించి, ఆమె కుటుంబ సభ్యులను గుర్తించి, సురక్షితంగా వారి సంరక్షణకు అప్పగించడం జరిగింది.

విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *