Story highlights
- పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి.
- నిశాంతి అధికారులతో సమీక్షించారు.
- కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు.
పాడేరు, నవంబర్ 26: అల్లూరి జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి అధికారులతో సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 29న పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. 87 గ్రామ పంచాయతీలు, 880 వార్డులకు ఎన్నికల నిర్వహణలో సిబ్బందికి శిక్షణ, రవాణా, భోజన వసతి, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News Sources
- Punnami ReportingOther source