संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

మహబూబాబాద్‌లో సర్వేయర్లకు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సర్వేపై శిక్షణ

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మహబూబాబాద్‌లో సర్వేయర్లకు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సర్వేపై శిక్షణ

खबर की मुख्य बातें

  • మహబూబాబాద్‌లో సర్వేయర్లకు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సర్వేపై శిక్షణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా భూ సర్వేలు నిర్వహించాలి – జాయింట్ కలెక్టర్ కే.
  • అనిల్ కుమార్ మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ (IDOC) కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కే.
  • అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, జిల్లా ఏడీ అండ్ ఎస్‌ఎల్‌ఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

మహబూబాబాద్‌లో సర్వేయర్లకు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సర్వేపై శిక్షణ

నిష్పక్షపాతంగా, పారదర్శకంగా భూ సర్వేలు నిర్వహించాలి – జాయింట్ కలెక్టర్ కే. అనిల్ కుమార్

మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ (IDOC) కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ కే. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో, జిల్లా ఏడీ అండ్ ఎస్‌ఎల్‌ఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో మండల సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎక్స్‌ట్రాజన్ రోవర్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎక్స్‌ట్రాజన్ రోవర్ సాంకేతిక నిపుణులచే ప్రత్యేక ప్రజెంటేషన్ నిర్వహించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూ సర్వేలను ఏ విధంగా చేపట్టాలి, కచ్చితమైన కొలతలు ఎలా తీసుకోవాలి, సర్వే ప్రక్రియలో పాటించాల్సిన సాంకేతిక విధానాల గురించి వివరించారు.

ఈ శిక్షణలో భాగంగా ఎక్స్‌ట్రాజన్ రోవర్ పరికరాల వినియోగం, వాటి పనితీరు, భూముల హద్దుల నిర్ధారణలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యత గురించి సర్వేయర్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కే. అనిల్ కుమార్ మాట్లాడుతూ భూ సర్వేలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కచ్చితమైన కొలతలతో సర్వేలు చేపట్టి, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సర్వేయర్లకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఏడీ అండ్ ఎస్‌ఎల్‌ఆర్ శ్రీనివాస్, మండల సర్వేయర్లు, జిల్లా సర్వేయర్లు, లైసెన్స్‌డ్ సర్వేయర్లు, ఎక్స్‌ట్రాజన్ రోవర్ సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

– పున్నమి రిపోర్టర్
భూక్య రాము నాయక్
మరిపెడ, మహబూబాబాద్ జిల్లా

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *