संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి!

खबर की मुख्य बातें

  • నెల్లూరు రూరల్: మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ సూచించారు.
  • మాదకద్రవ్యాల అలవాటు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు.
  • జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు రూరల్‌లోని సౌత్రరాజుపాళెం ఎస్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

నెల్లూరు రూరల్: మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ సూచించారు. మాదకద్రవ్యాల అలవాటు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని హెచ్చరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు రూరల్‌లోని సౌత్రరాజుపాళెం ఎస్టీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యాయసేవలు, వాటిని పొందే విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *