Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nandyal

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎన్ఎండి ఫయాజ్

Punnami Newsroom Published:
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎన్ఎండి ఫయాజ్

Story highlights

  • నంద్యాల :ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు.
  • బుధవారం నంద్యాల పట్టణంలోని 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ పరిధిలో మాజీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
  • కొన్ని సమస్యలపై తక్షణమే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నంద్యాలలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారని ఫయాజ్ తెలిపారు.

నంద్యాల :ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని 12వ వార్డు బాలాజీ కాంప్లెక్స్ పరిధిలో మాజీ కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ ఆధ్వర్యంలో ‘డోర్ టు డోర్’ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న ఫయాజ్ ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలపై తక్షణమే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నంద్యాలలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారని ఫయాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బింగుమల్లా శ్యామసుందర్ గుప్తా, చింతల కుమార్, చంద్రమౌళి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *