Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Tirupati

పుల్లంపేట: ఆటో డ్రైవర్ పై దాడి… ఇద్దరు నిందితుల అరెస్ట్

Punnami Newsroom Published:
పుల్లంపేట: ఆటో డ్రైవర్ పై దాడి… ఇద్దరు నిందితుల అరెస్ట్

Story highlights

  • పుల్లంపేట: ఆటో డ్రైవర్‌పై దాడి చేసి ఆటో, నగదు, మొబైల్‌ ఫోన్‌ దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేశారు.
  • వారి నుంచి దోపిడీకి గురైన ఆటో, మొబైల్‌ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రింగ్‌ స్పానర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
  • పోలీసుల వివరాల మేరకు..

పుల్లంపేట: ఆటో డ్రైవర్‌పై దాడి చేసి ఆటో, నగదు, మొబైల్‌ ఫోన్‌ దోపిడీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను పుల్లంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దోపిడీకి గురైన ఆటో, మొబైల్‌ ఫోన్‌తో పాటు నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, రింగ్‌ స్పానర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల మేరకు.. 2025 జూలై 31న రాత్రి రాజంపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద మేకల హనుమంతు అనే ఆటో డ్రైవర్‌ నుంచి హస్తవరం ఈశ్వరయ్య, బాలిపోగు రెడ్డెయ్య ఆటోను బాడుగకు తీసుకున్నారు. అనంతరం అనంతసముద్రం పరిసరాల్లోని జనసంచారం లేని అరటితోట వద్దకు తీసుకెళ్లి ఆటోను నిలిపారు. సీటు కింద ఉన్న ఇనుప రాడ్డు, రింగ్‌ స్పానర్లతో డ్రైవర్‌పై దాడి చేసి రూ.6 వేల నగదు, వీవో మొబైల్‌ ఫోన్‌, ఆటోను బలవంతంగా తీసుకుని పరారయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ నెల 27న పుల్లంపేట వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారం మేరకు AP39-TD-5768 నంబర్‌ గల ఆటో, వీవో వై27 మొబైల్‌ ఫోన్‌, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కేసు ఛేదనలో చురుకుగా వ్యవహరించిన సీఐ డి.శ్రీనివాసులు, ఎస్‌ఐ వి.చిన్నరెడ్డెప్పతో పాటు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *