Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Narayanpet

ఖేలోఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలి గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన వాకిటి శ్రీహరి

Punnami Newsroom Published: Updated:
ఖేలోఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలి గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన వాకిటి శ్రీహరి

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా క్రీడల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని మంత్రి సందర్శించి, క్రీడల నిర్వహణ కోసం చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టేడియంలోని క్రీడా ప్రాంగణాలు, క్రీడాకారులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. క్రీడల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఖేలోఇండియా క్రీడలకు పకడ్బందీ ఏర్పాట్లుచేయాలి గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన వాకిటి శ్రీహరి

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *