Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

కంటకాపల్లి గ్రామపంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు

Punnami Newsroom Published: Updated:
కంటకాపల్లి గ్రామపంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు

కంటకాపల్లి గ్రామపంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
పటిష్ట పోలీసు బందోబస్తుతో కొత్తవలస సీఐ టీవీ విజయకుమార్ ఆధ్వర్యంలోఎన్నికల నిర్వహణ
ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన పోలీసులకు స్థానికుల అభినందలు
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, నవంబరు 05. (పున్నమి ప్రతినిధి)
కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు ప్రణాళికతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి, పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం భద్రతను పర్యవేక్షించారు. సీఐ టీవీ విజయకుమార్, ఎస్ఐ రాజేష్ తమ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఎన్నికల విధుల్లో పోలీసులపై ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విన్నారు. అవసరమైన చోట కఠినంగా వ్యవహరిస్తూనే, మరికొన్ని సందర్భాల్లో మానవీయ దృక్పథంతో స్పందించడం స్థానికుల ప్రశంసలు అందుకుంది.
ఎన్నికల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు సహకారం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన సీఐ, ఎస్ఐతో పాటు పోలీసు సిబ్బందిని స్థానికులు అభినందించారు.
ఈ కంటకాపల్లి గ్రామపంచాయతీలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో గాని, ఓటర్ జాభితాలు నిర్వహణ మరియు స్థానిక ఏర్పాట్లును పంచాయతీ కార్యదర్శి ప్రియాంక గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు బాగా సహాయం చేశారని స్థానికులు పోలింగ్ అధికారులు తెలియజేశారు

కంటకాపల్లి గ్రామపంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు

కంటకాపల్లి గ్రామపంచాయతీలో ప్రశాంతంగా ముగిసిన ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *