Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

ఒడిశాలో మన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి

Punnami Newsroom Published: Updated:
ఒడిశాలో మన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి

అనపర్తి, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): ఒడిశాలో వరి సాగు చేస్తున్న అనపర్తి నియోజకవర్గానికి చెందిన రైతుల ధాన్యాన్ని అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల క్రితం రైతులు తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

రైతుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సమస్యను రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి ఫోన్ ద్వారా తీసుకువెళ్లారు. రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరంలోని ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో జరిగిన సమావేశంలో ఒడిశాలో ఉన్న అనపర్తి నియోజకవర్గ రైతుల ధాన్యం కొనుగోలు సమస్యపై చర్చించారు. సమస్యను ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శ్రీ పృథ్వీరాజ్ హరిచందన్, ఒడిశా రాష్ట్ర సివిల్ సప్లయిస్ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్ర దృష్టికి ఎంపీ పురందేశ్వరి తీసుకువెళ్లారు. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా, వారి సమస్యకు పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సెప్టెంబర్ 3న గవర్నర్‌తో రైతుల సమావేశం

అనపర్తి నియోజకవర్గానికి చెందిన ఒడిశా రైతుల సమస్యను నేరుగా తెలుసుకునేందుకు సెప్టెంబర్ 3వ తేదీన రైతులను కలిసేందుకు ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా ఒడిశాలో ఉన్న అనపర్తి నియోజకవర్గ రైతులు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి శ్రీ పృథ్వీరాజ్ హరిచందన్, రాష్ట్ర సివిల్ సప్లయిస్ మంత్రి శ్రీ కృష్ణ చంద్ర పాత్రను కలిసి తమ ధాన్యం కొనుగోలు సమస్యను వివరించాలని సూచించారు.

తమ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపుతున్న రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఒడిశాలోని అనపర్తి నియోజకవర్గ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఒడిశాలో మన రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *