संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
अनकापल्ली

ఏటికొప్పాకలో స్వచ్ఛత పాఠాలు.. పంచాయతీలకు ఎక్స్‌పోజర్ విజిట్

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
ఏటికొప్పాకలో స్వచ్ఛత పాఠాలు.. పంచాయతీలకు ఎక్స్‌పోజర్ విజిట్

खबर की मुख्य बातें

  • పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో) ఏటికొప్పాక, అక్టోబర్ 6: ఎలమంచిలి మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఏటికొప్పాక పంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమాన్ని బుధవారం 07-10-2026న నిర్వహించనున్నారు.
  • ఎంపీడీవో దీపిక ఆధ్వర్యంలో, ఏటికొప్పాక పంచాయతీ కార్యదర్శి కే.
  • గిరి ప్రసాదరావు సమన్వయంతో ఈ కార్యక్రమం జరగనుంది.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో)

ఏటికొప్పాక, అక్టోబర్ 6: ఎలమంచిలి మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఏటికొప్పాక పంచాయతీలో ఎస్‌డబ్ల్యూపీసీ ఎక్స్‌పోజర్ విజిట్ కార్యక్రమాన్ని బుధవారం 07-10-2026న నిర్వహించనున్నారు. ఎంపీడీవో దీపిక ఆధ్వర్యంలో, ఏటికొప్పాక పంచాయతీ కార్యదర్శి కే. గిరి ప్రసాదరావు సమన్వయంతో ఈ కార్యక్రమం జరగనుంది.
మండలంలోని వివిధ పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్లు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏటికొప్పాకలో అమలు చేస్తున్న తడి, పొడి చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయడం, ఎస్‌డబ్ల్యూపీసీలో ప్రాసెసింగ్, పునర్వినియోగం తదితర విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవగాహన పొందనున్నారు.
గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఏటికొప్పాకలో అమలు చేస్తున్న మెరుగైన ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను ఇతర పంచాయతీల్లోనూ అమలు చేసేలా ఈ ఎక్స్‌పోజర్ విజిట్ దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *