అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఓజోన్ పొర పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని ప్రిన్సిపాల్ డా. సిహెచ్. కేశవరావు తెలిపారు. రసాయనశాస్త్ర అధ్యాపకులు రమ్యశ్రీ, సురేష్, వైస్ ప్రిన్సిపాల్ కె నిర్మల, ఎన్ఎస్ఎస్ పీవోలు విజయలక్ష్మి, లచ్చన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పోటీల్లో విజేతలకు బుధవారం బహుమతులు అందజేయనున్నారు.

అరకు: ఓజోన్ పరిరక్షణపై విద్యార్థులకు పోటీలు