Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Hyderabad

హుస్నాబాద్ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా

Punnami Newsroom Published:
హుస్నాబాద్ అభివృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా

Story highlights

  • సిద్దిపేటలో నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
  • ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
  • దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులందరికీ ఉచిత సహాయ ఉపకరణాలు అందిస్తామని వెల్లడించారు.

సిద్దిపేటలో నవంబర్ 19న ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులందరికీ ఉచిత సహాయ ఉపకరణాలు అందిస్తామని వెల్లడించారు. అక్కన్నపేటలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడం తన బాధ్యతని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అక్కన్నపేట–హుస్నాబాద్ నాలుగు లైన్ల రహదారి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *