Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

Punnami Newsroom Published:
శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

కొత్తవలస మండలము మంగళ పాలెం గ్రామంలో గల శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం- పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఐ.పీ.ఎస్

దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్లు పంపిణీ

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, అక్టోబర్ 24. ( పున్నమి ప్రతినిధి )

కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామం లో గల గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు దివ్యాంగులకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్ అన్నారు. మంగళపాలెంలోని శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొలుత ట్రస్ట్‌ను సందర్శించిన ఎస్పీ దామోదర్, అక్కడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం 30 మందికి పైగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, చేతి ఊతకర్రలు, వినికిడి యంత్రాలు తదితర సహాయక పరికరాలను తన చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు.
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తూ అవసరమైన వారికి సహాయం అందించడం గొప్ప విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు , ట్రస్ట్ వైస్ చైర్మన్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే కొత్తవలస మోడల్ స్కూల్, హైస్కూల్, బీఎస్ఎం స్కూల్ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం

News Sources

  • Punnami ReportingOwn reporting

Leave a comment

Your email address will not be published. Required fields are marked *