Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

రాయవరపు చెన్నమ్మకు ఘనంగా నివాళులు

-భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించిన దారపనేని చంద్రశేఖర్

పామూరు, అక్టోబర్ 3(పున్నమి ప్రతినిధి ):

కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ సమీప బంధువు రాయవరపు చెన్నమ్మ (80) మృతి చెందారు. శనివారం ఆమె భౌతికాయానికి దారపనేని చంద్రశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చెన్నమ్మకు కుమారులు మల్లికార్జునరావు, లక్ష్మణరావు, కుమార్తెలు లక్ష్మీరాజ్యం, కృష్ణవేణి, సరళతో పాటు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. రాయవరపు చెన్నమ్మకు నివాళులర్పించిన వారిలో డాక్టర్ తిరివీధి చెన్నకృష్ణయ్య, తిరివీధి జనార్దన్‌రావు, గోపాల్, తిరివీధి కేశవరావు, హజరత్, తిరివీధి చంద్రశేఖర్, వెంకటస్వామి, నూతంగి శ్రీనివాసులు, రామకృష్ణ, నూతంగి వెంకటనారాయణ, సత్యనారాయణ, తిరివీధి శ్రీనివాసులు (నెల్లూరు), నూతంగి భాగ్యమ్మ, తిరివీధి విజయమ్మ, దారపనేని చెన్నమ్మ, తిరివీధి రేవతి తదితరులు ఉన్నారు. రాయవరపు, నూతంగి, తిరివీధి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని చెన్నమ్మకు నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *