అనపర్తి, సెప్టెంబర్ 16 (పున్నమి ప్రతినిధి): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందింది. ఏపీత్రయం గ్రామానికి చెందిన చింత సత్యనారాయణకు వైద్య సహాయం నిమిత్తం మంజూరైన రూ.55,000 విలువైన చెక్కును అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయాన్ని అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత