संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
महबूबाबाद

మరిపెడ మున్సిపాలిటీ ప్రజలకు పన్నుల భారం తగ్గింపు.. ఆర్థిక ఊరట!

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
మరిపెడ మున్సిపాలిటీ ప్రజలకు పన్నుల భారం తగ్గింపు.. ఆర్థిక ఊరట!

खबर की मुख्य बातें

  • మరిపెడ మున్సిపాలిటీ ప్రజలకు పన్నుల భారం తగ్గింపు..
  • ఆర్థిక ఊరట!
  • ఒక శాతం నుంచి 0.5 శాతానికి తగ్గింపు..

మరిపెడ మున్సిపాలిటీ ప్రజలకు పన్నుల భారం తగ్గింపు.. ఆర్థిక ఊరట!

ఒక శాతం నుంచి 0.5 శాతానికి తగ్గింపు.. ప్రజల్లో హర్షం

మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు ఆర్థిక భారం తగ్గించే దిశగా పన్నుల శాతాన్ని ఒక శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులతో సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పన్నుల తగ్గింపు నిర్ణయం కొంత ఊరట కలిగించనుంది.

2024 మార్కెట్ విలువలు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రజలపై పన్నుల భారం తగ్గించేలా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మున్సిపాలిటీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజలపై పడుతున్న అదనపు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చొరవ చూపిన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్ర నాయక్‌కు, మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డికి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మేలు చేసే మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

समाचार स्रोत

  • Punnami Reportingस्वयं की रिपोर्टिंग

Leave a comment

Your email address will not be published. Required fields are marked *