Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

ప్రెసిడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ

Punnami Newsroom Published:
ప్రెసిడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ

Story highlights

  • అరకు వ్యాలీ, నవంబర్ 28: గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్‌–III నిర్వహణలో భాగంగా ప్రెసిడింగ్ అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది.
  • అరకు బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కె.
  • సాహిత్‌ ఐఏఎస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అరకు వ్యాలీ, నవంబర్ 28: గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్‌–III నిర్వహణలో భాగంగా ప్రెసిడింగ్ అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. అరకు బాలుర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కె. సాహిత్‌ ఐఏఎస్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల విధివిధానాలు, నిబంధనలు, పోలింగ్ ప్రక్రియ, అధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన విధులపై పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీసం ప్రసాద్, ఎంఈఓ ప్రధాని భారతీదేవి, వంతల త్రినాధరావు, మాస్టర్లు పాల్, టి. ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

News Sources

  • Punnami ReportingOther source

Leave a comment

Your email address will not be published. Required fields are marked *