संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
प्रकाशम

ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శిస్తున్న ఆకుపాటి నోహిత్

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శిస్తున్న ఆకుపాటి నోహిత్

పామూరు: మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని ఆల్ఫా లిటిల్ కింగ్డమ్ స్కూల్‌లో నిర్వహించిన 7వ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్‌లో విద్యార్థి ఆకుపాటి నోహిత్‌ తన ప్రతిభను చాటుకున్నారు. లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ (జీవులు, నిర్జీవులు) అంశాలపై రూపొందించిన ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శించి, వాటి గురించి వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలను ఆచరణాత్మకంగా వివరిస్తూ, ఇతరుల ముందు ధైర్యంగా మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడ్ అకడమిక్ అడ్వైజర్ రహమాన్ ఖాన్, ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, ఇన్‌చార్జి బిందు థామస్ పాల్గొన్నారు.

ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శిస్తున్న ఆకుపాటి నోహిత్

ప్రాజెక్టు వర్క్‌ను ప్రదర్శిస్తున్న ఆకుపాటి నోహిత్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *