खबर की मुख्य बातें
- సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిలి: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు.
- సూర్యశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని సూచించారు.
- అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
యలమంచిలి: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సూర్యశక్తిని వినియోగించడం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని సూచించారు. అర్హత కలిగిన గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్నందున ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఇళ్లపై పడే సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చుకుని అవసరాలకు తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. యలమంచిలి నియోజకవర్గాన్ని సోలార్ వినియోగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.