పెద్దవంగర, జూలై 19:
పెద్దవంగర మండల బీఎస్పీ అధ్యక్షులు రాంపాక కిరణ్ గారి తండ్రి రాంపాక ఇద్దయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు వారి నివాసానికి చేరుకున్న జనగామ జిల్లా బీఎస్పీ ముఖ్య నాయకులు, రాంపాక ఇద్దయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని చెప్పారు. ఈ కష్ట సమయంలో పార్టీ మరియు నాయకత్వం ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ నివాళి మరియు పరామర్శ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఇదునూరి ప్రసాద్, జిల్లా EC సభ్యులు సోమరాపు ఉపేందర్, లక్కం అశోక్ యాదవ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు చింత గణేష్, దేవరుప్పుల మండల అధ్యక్షులు మరియు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దవంగరలో బీఎస్పీ నాయకుల పరామర్శ, ఇద్దయ్యకు నివాళి
పెద్దవంగర, జూలై 19: పెద్దవంగర మండల బీఎస్పీ అధ్యక్షులు రాంపాక కిరణ్ గారి తండ్రి రాంపాక ఇద్దయ్య గారు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు వారి నివాసానికి చేరుకున్న జనగామ జిల్లా బీఎస్పీ ముఖ్య నాయకులు, రాంపాక ఇద్దయ్య గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, కిరణ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని చెప్పారు. ఈ కష్ట సమయంలో పార్టీ మరియు నాయకత్వం ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ నివాళి మరియు పరామర్శ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఇదునూరి ప్రసాద్, జిల్లా EC సభ్యులు సోమరాపు ఉపేందర్, లక్కం అశోక్ యాదవ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు చింత గణేష్, దేవరుప్పుల మండల అధ్యక్షులు మరియు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

