संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

పుల్లాయపల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
పుల్లాయపల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

खबर की मुख्य बातें

  • ఉదయగిరి: గడ్డంవారిపల్లి క్లస్టర్ పరిధిలోని పుల్లాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈవో టి.
  • శ్రీనివాసులు బుధవారం తనిఖీ చేశారు.
  • తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన స్థాయి, పఠన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఉదయగిరి: గడ్డంవారిపల్లి క్లస్టర్ పరిధిలోని పుల్లాయపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈవో టి. శ్రీనివాసులు బుధవారం తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన స్థాయి, పఠన సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు జి. సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులను ఎంఈవో అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *