संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
काकीनाडा

*పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ* *రామచంద్రపురం, కే.గంగవరం మండలాలకు రూ.3.92 కోట్ల నిధులు* *ద్రాక్షారామం మార్కెట్‌లో రూ.79 లక్షలతో సీసీ రోడ్లు, మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన.*

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
*పల్లె పండుగ 3.0తో గ్రామాలకు మహర్దశ* *రామచంద్రపురం, కే.గంగవరం మండలాలకు రూ.3.92 కోట్ల నిధులు* *ద్రాక్షారామం మార్కెట్‌లో రూ.79 లక్షలతో సీసీ రోడ్లు, మార్కెట్ షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన.*

खबर की मुख्य बातें

  • డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,ద్రాక్షరామం,అక్టోబర్ 6(పున్నమి న్యూస్): పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపడి గ్రామాలకు మహర్దశ రానుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు.కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయల నిధులతో…
  • ద్రాక్షారామం మార్కెట్‌లో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.79 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మార్కెట్ షెడ్ (విలేజ్ హాట్) నిర్మాణ పనులకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్,డీఎల్‌డీవో వి.
  • అబ్రహం లింకన్,ఎంపీడీవో పద్మజ్యోతి,కూటమి నాయకులతో కలిసి వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా,ద్రాక్షరామం,అక్టోబర్ 6(పున్నమి న్యూస్):
పల్లె పండుగ 3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మరింత మెరుగుపడి గ్రామాలకు మహర్దశ రానుందని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు.కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు.
ద్రాక్షారామం మార్కెట్‌లో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.79 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, మార్కెట్ షెడ్ (విలేజ్ హాట్) నిర్మాణ పనులకు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్,డీఎల్‌డీవో వి. అబ్రహం లింకన్,ఎంపీడీవో పద్మజ్యోతి,కూటమి నాయకులతో కలిసి వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక చొరవతో ద్రాక్షారామం మార్కెట్‌ను ఆధునిక మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని సత్యం తెలిపారు.గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్కెట్ మొత్తం దగ్ధమై వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని,ఆ సమయంలో మంత్రి సుభాష్ వెంటనే స్పందించి బాధిత వ్యాపారులకు అండగా నిలిచారని చెప్పారు. కొత్త షాపుల నిర్మాణంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందించారని పేర్కొన్నారు.
మార్కెట్‌లో అగ్నిమాపక వాహనాలు సైతం సులభంగా తిరిగేలా సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు 122 షాపుల నిర్మాణానికి మంత్రి సుభాష్ కృషి చేశారని తెలిపారు.తాజాగా పల్లె పండుగ 3.0 ద్వారా మార్కెట్‌లో మరో రూ.79 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

*రామచంద్రపురం, కే.గంగవరం మండలాలకు రూ.3.92 కోట్లు*

పల్లె పండుగ 3.0లో భాగంగా రామచంద్రపురం మండలానికి రూ.2.55 కోట్లు, కే.గంగవరం మండలానికి రూ.1.37 కోట్లు, మొత్తం రూ.3.92 కోట్ల నిధులు మంజూరయ్యాయని వాసంశెట్టి సత్యం వెల్లడించారు. మంత్రి సుభాష్ కృషితో ప్రతి మండలానికి మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉందన్నారు.
ఇప్పటి వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రామచంద్రపురం పట్టణంలోనే సుమారు రూ.70 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగాయని చెప్పారు. వీటికి అదనంగా సీఎస్‌ఆర్ నిధులను సమీకరించి నియోజకవర్గంలో అనేక సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

*పల్లె పండుగకు సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రాధాన్యం*

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో పల్లె పండుగ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు.గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి వాసంశెట్టి సుభాష్ నిరంతరం శ్రమిస్తూ, పట్టుదలతో ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమని అన్నారు.

*రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది*

కూటమి పార్టీ నాయకులు పప్పుల మశేను (రేవు శీను) మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరపడి రామరాజ్యం వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రామలక్ష్మణులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రధాని నరేంద్ర మోదీ వారి వెన్నంటే నిలిచి దేశాన్ని సువర్ణమయం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. బీసీ సెల్ రాష్ట్ర నాయకులు పెంకే సాంబశివరావు, రామచంద్రపురం రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, ప్రముఖ న్యాయవాది మాగాపు అమ్మిరాజు,టేకుమూడి సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పల్లె పండుగ 3.0 ద్వారా పెద్దపీట వేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఇటీవల స్వచ్ఛ ఆంధ్ర ఉత్తమ ఎన్జీవో అవార్డు అందుకున్న వాసంశెట్టి సత్యం ను పలువురు అధికారులు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నాటక అకాడమీ డైరెక్టర్ పెంకె అన్నపూర్ణ, ఏఈ ఏసురత్నం, పంచాయితీ సెక్రటరీ సత్యనారాయణ, డాక్టర్ రాంబాబు, మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ సుబ్బారావు, మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ రామారావు, వయిట్ల గజలక్ష్మి, ఆళ్ల బుజ్జి,సంపత్ సత్యనారాయణ,అల్లం రామకృష్ణ,దుళ్ల కొండ, ఆకేటి శ్రీకృష్ణ,ఆకేటి సురేష్,అబ్బాయి నాయుడు,రాము,బోనం శ్రీను,చంటి, పలువురు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *