संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
काकीनाडा

నన్నయలో బి.ఎడ్. కళాశాలల స్టాఫ్ రెడిఫికేషన్ ను పరిశీలించిన వీసీ

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:
నన్నయలో బి.ఎడ్. కళాశాలల స్టాఫ్ రెడిఫికేషన్ ను పరిశీలించిన వీసీ

खबर की मुख्य बातें

  • కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్): ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ బి.ఎడ్.
  • కళాశాలల సిబ్బంది రాటిఫికేషన్ ప్రక్రియను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.
  • ప్రసన్నశ్రీ పరిశీలించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 6(పున్నమి న్యూస్):
ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అనుబంధ బి.ఎడ్. కళాశాలల సిబ్బంది రాటిఫికేషన్ ప్రక్రియను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ పరిశీలించారు. విశ్వవిద్యాలయంలోని కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీడీసీ) కార్యాలయంలో అక్టోబర్ 5 నుంచి 9వ తేదీ వరకు రాటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
రాటిఫికేషన్ ప్రక్రియను వీసీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది రాటిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి. అర్హతలు, నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రాటిఫికేషన్ పూర్తి చేయాలి. విద్యా ప్రమాణాలను కాపాడే విధంగా నాణ్యమైన అధ్యాపక సిబ్బంది నియామకానికి ప్రాధాన్యత ఇవ్వాలి” అని సూచించారు.
నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని 38 ఎడ్యుకేషన్ కళాశాలలు, 2 స్పెషల్ ఎడ్యుకేషన్ కళాశాలలు, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలకు సంబంధించిన అధ్యాపక సిబ్బంది రాటిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య కె. శ్రీ రమేష్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, నేషనల్ సంస్కృత యూనివర్సిటీ, తిరుపతి ప్రొఫెసర్ వెంకట్రావు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఆర్. సాంబశివరావు, ఎం. గోపాలకృష్ణ, రాజామణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *