Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Nandyal

నంద్యాల రావుస్ జూనియర్ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Punnami Newsroom Published:

Story highlights

  • నంద్యాల : స్థానిక శ్రీనివాసనగర్‌లోని రావుస్ జూనియర్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
  • డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారని కళాశాల డైరెక్టర్ శ్రీ ఎ.
  • మోని చంద్ర, ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన ‘విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర’ వ్యాసరచన పోటీ విజేతలతో పాటు, క్వార్టర్లీ మరియు వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.డైరెక్టర్ మోని చంద్ర మాట్లాడుతూ..

నంద్యాల : స్థానిక శ్రీనివాసనగర్‌లోని రావుస్ జూనియర్ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సన్మానించారని కళాశాల డైరెక్టర్ శ్రీ ఎ. మోని చంద్ర, ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన ‘విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర’ వ్యాసరచన పోటీ విజేతలతో పాటు, క్వార్టర్లీ మరియు వార్షిక పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 20 మంది ఉత్తమ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.డైరెక్టర్ మోని చంద్ర మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల స్ఫూర్తితో అధ్యాపకులందరూ విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ రొడ్డ సుంకయ్య మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, గత 35 ఏళ్లుగా రావుస్ విద్యాసంస్థల విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, సిఏలుగా స్థిరపడటం గర్వకారణమని అన్నారు. సంస్థల వ్యవస్థాపక చైర్మన్ ఎ.ఎం.వి. అప్పారావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *