Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Chittoor

నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Punnami Newsroom Published:
నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, అక్టోబర్ 09 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
శ్రీకాళహస్తి పరిధిలోని నందిహిల్స్ వద్ద శబరిమల అయ్యప్ప స్వామి వారి తత్వమసి సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయాన్ని స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గురుస్వాములు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు అత్యంత అనుకూలమైన ప్రశాంత వాతావరణంలో, చక్కని ప్రదేశంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించడం అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన ‘ఎస్ఏఎస్‌వీటీఎస్ఎస్’ (SASVTSS) కమిటీ సభ్యుల కృషిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గురుస్వాములు, భక్తులు పాల్గొన్నారు.

నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

నందిహిల్స్ అయ్యప్ప దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *