Story highlights
- కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5 (పున్నమి న్యూస్): కాకినాడ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కలెక్టర్…
- రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖను బలోపేతం చేస్తూ ప్రజలకు సకాలంలో సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.వైద్య సేవల నిమిత్తం సర్వజన ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు సత్వరమే వైద్య సేవలు అందేలా డాక్టర్లు సిబ్బంది అందుకు…
- పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో భాగంగా నర్సింగ్ విద్యనభ్యసించే విద్యార్థులను కూడా వైద్య సేవలను నిమిత్తం వినియోగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు.
కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 5 (పున్నమి న్యూస్):
కాకినాడ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నందు రాజ్యసభ సభ్యులు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్,ఎం ఎల్ సి కర్రి పద్మశ్రీ,కాకినాడ అర్బన్ రూరల్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర రావు,పంతం నానాజీ లతో కలసి జిల్లా ప్రధాన ఆస్పత్రి పనితీరు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖను బలోపేతం చేస్తూ ప్రజలకు సకాలంలో సరైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు.వైద్య సేవల నిమిత్తం సర్వజన ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు సత్వరమే వైద్య సేవలు అందేలా డాక్టర్లు సిబ్బంది అందుకు అనుగుణంగా బాధ్యతగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో భాగంగా నర్సింగ్ విద్యనభ్యసించే విద్యార్థులను కూడా వైద్య సేవలను నిమిత్తం వినియోగిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు.
*పంట కాలువలు డ్రైనేజీ లపై ఉన్న ఆక్రమణల తొలగింపు నకు చర్యలు*
ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్న కాలనీలతోపాటు పంట కాలవలు మరియు డ్రైనేజీల నుండి నీరు వెళ్లేందుకు అవకాశం లేకుండా ఆక్రమణలకు గురైన వాటి తొలగింపునకు చర్యలు తీసుకోవాలని ఎంపీ తెలిపారు.
ఇందుకు సంబంధించి ఏర్పాటైన త్రీ మెన్ కమిటీ వారు సర్వే తో పాటు ఇరిగేషన్,రెవిన్యూ కార్పొరేషన్ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి ఆక్రమణలు తొలగించాలని తెలిపారు.తద్వారా రానున్న కాలంలో కురిసే వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఆ దిశగా పనిచేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.