Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Prakasam

గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహకాలను పకడ్బందీగా చేపట్టాలి

Punnami Newsroom Published: Updated:
గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహకాలను పకడ్బందీగా చేపట్టాలి

Story highlights

  • Uploaded Video:

గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహకాలను పకడ్బందీగా చేపట్టాలి

మార్కాపురం జిల్లాలో 2026లో నిర్వహించనున్న రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

శనివారం మార్కాపురం కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహకాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి, అవసరమైన చోట్ల మెరుగుపరచాలని ఆదేశించారు.

పోలింగ్ సిబ్బంది వివరాలను సిద్ధం చేయడంతో పాటు, వారికి అవసరమైన శిక్షణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సామగ్రి, రికార్డులు, సిబ్బంది కేటాయింపుపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, డీఆర్వో శ్రీదేవి, డీపీఓ ఫణింద్ర కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *