పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి . సెప్టెంబర్ 25 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల యొక్క సిబ్బంది తమకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని అంతేకాకుండా పెండింగ్లో ఉన్న శాలరీని వెంటనే విడుదల చేసి పార్ట్ టైం గా ఉన్న వారిని తక్షణమే కాంట్రాక్టు టీచర్స్ గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని గత కొన్ని సంవత్సరాలుగా 24 గంటలు పనిచేస్తూ కొద్దిపాటి జీతాలతో పనిచేయుచున్న భారమవుతుందని ఆంధ్ర ప్రదేశ్ పార్ట్ టైం టీచర్ల రాష్ట్ర కోర్ కమిటీ నాయకులు. కె వర్మ.సునీత. జిల్లా కోర్ కమిటీ నాయకులు పి చిరంజీవి. బి బేబీ పిలుపుమేరకు సెప్టెంబర్ 25 తేదీ శుక్రవారం ఉదయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల కళాశాల నరేంద్రపురం ప్రిన్సిపల్ అనిల్ కుమార్ కి వినతి పత్రం అందజేసి ,తమకు తగిన న్యాయం జరగకపోతే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు తగిన నిర్ణయాలు తీసుకుని న్యాయపోరాటం చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల కళాశాల పార్ట్ టైం టీచర్స్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలు లో ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు అల్లవరం ముమ్మిడివరం రాజోలు. నరేంద్రపురం అన్ని పాఠశాలల ప్రిన్సిపాల్ కు వినతి పత్రాలు అందజేసి న్యాయం చేయాలని తెలియజేశారు.


